![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -602 లో.... దీప, కార్తీక్ కిచెన్ లో మాట్లాడుకుంటారు. అమ్మనాన్న ఎప్పుడు సంతోషంగా ఉండాలని దీప ఏడుస్తుంది. ఉంటారని కార్తీక్ అంటాడు. దీపాల వెలుగుల్లో మీ నాన్న నిన్ను చూసి మురిసిపోయాడు దీపాల వెలుగుల్లో నీ కడుపులో ఉన్న నా కూతురిని చూసి తట్టుకోలేకపోయానని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. మరొక వైపు జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు. అప్పుడే దాస్ వస్తాడు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావ్ రా అని పారిజాతం అడుగుతుంది.
నాన్న అని జ్యోత్స్న పిలుస్తుంది. నువ్వు అలా పిలవకు అమ్మ.. చిన్నాన్న అని పిలువు.. ఎందుకు అంటే నువ్వు మా సుమిత్ర వదిన కూతురివి అని దాస్ అనగానే నువ్వు కూడా అలాగే మాట్లాడుతావు ఏంటి నాన్న అని జ్యోత్స్న అంటుంది. ఆ రిపోర్ట్స్ ని నమ్మకండి అని జ్యోత్స్న అంటుంది. నువ్వు ఇక నన్ను కిడ్నాప్ చెయ్యడాలు.. నువ్వు భయపడడాలు.. ఈ నిజాలు చెప్పడాలు ఏం లేవని దాస్ అంటాడు. మరి నీ కూతురు ఎక్కడ రా అని పారిజాతం అంటుంది. నా కూతురు ఎక్కడో క్షేమంగా ఉంటుందని చెప్పి దాస్ వెళ్ళిపోతాడు. దాస్ కూతురు దీప అని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు దశరథ్, కార్తీక్ దీప కలిసి కాంచన దగ్గరికి వస్తారు. దశరథ్ చాలా హ్యాపీగా ఉంటాడు. ఏంటి అన్నయ్య ఇలా వచ్చారని కాంచన అనగానే నాన్న కూడా వచ్చాడు. బయటఫోన్ మాట్లాడుతున్నాడని దశరత్ చెప్తాడు. అంతలోనే శివన్నారాయణ వస్తాడు. మీ అన్నయ్య గుడికి వెళ్లి వచ్చినప్పటి నుండి చాలా సంతోషంగా ఉన్నాడని శివన్నారాయణ అంటాడు. ఏమైంది అన్నయ్య అని కాంచన అడుగుతుంది. చెప్తాను అమ్మ అని దశరథ్ అంటాడు.
మరొకవైపు దశరథ్ ప్రవర్తన గుర్తుచేసుకొని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది అసలు నాన్నకి ఏదో నిజం తెలిసిందని జ్యోత్స్న అనగానే ఏం నిజం అసలైన వారసురాలు నువ్వే కదా అని పారిజాతం అంటుంది. అసలు నిజం తెలియక ఇలా మాట్లాడుతున్నావ్.. అసలు దీప ఎవరో తెలుసా అని జ్యోత్స్న ఏదో చెప్పబోయి ఆగిపోతుంది. దీప నా మనవరాలు అయ్యే ఛాన్స్ లేదు.. నా లక్షణాలు ఒక్కటీ లేవు చెప్పాలంటే దీప ఒక అనాధ.. ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని పారిజాతం అంటుంది. ఆ తర్వాత నా ఆనందానికి కారణం చెప్తాను.. అమ్మ కోరిక అందరు కలిసి ఉండాలని అందుకే నీకు పెళ్లి చేసి నాన్న అందుబాటులో పెట్టుకున్నాడని కాంచనతో దశరథ్ అంటాడు. నా కూతురిని నీ ఇంటికి కోడలు చేసుకుంటే ఎప్పుడు కలిసి ఉంటాం అనుకున్నానని దశరథ్ అంటాడు కానీ అది జరగలేదని కాంచన అనగానే జరిగింది. నా కూతురిని నీ ఇంటికి కోడలు చేసుకున్నావని దశరథ్ అనగానే అందరు షాక్ అవుతారు. ఏంటి నాన్న నీ కూతురు ఈ ఇంటికి కోడలు అయిందా అని జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |